నేరేడ్మెట్, ఫిబ్రవరి 20 : ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో భోగ శ్రీనివాసమూర్తి కౌతుక బేరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ప్రాతఃకాల ఆరాధన, బాల భోగం అనంతరం మూర్తి కుంభస్థాపన, మూల మంత్ర పరివార, పంచ సూక్త హోమాలు, పూర్ణాహుతి, కుంభ సంప్రోక్షణ అనంతరం భోగ శ్రీనివాసమూర్తికి 108 లీటర్ల క్షీరాభిషేకం, విశేష అలంకరణ, మహానివేదన, హారతి మంత్ర పుష్పం, గోష్టి తదితర కార్యక్రమాలు జరిగాయని ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణాచార్యులు, అర్చకులు తులసి వెంకటరమణాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఏబీ రవీంద్ర రెడ్డి, క్లర్కు సండ్ర సుధాకర్, మాజీ చైర్మన్లు ఉమేశ్‌సింగ్, రాందాస్ సంతోష్ ముదిరాజ్, మాజీ ధర్మకర్తలు సునీల్‌రెడ్డి, గణేశ్(కన్న)రవీందర్, రత్నాకర్, భక్తులు సంజయ్ చంద్రకళ, వరదరాజు, శ్రీనివాస్, దేవి, లలిత, మీనాక్షి, కల్యాణి, శ్రీనివాస్, రేఖ తదితరులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.