హైదరాబాద్ ఆట ప్రతినిధి, ఫిబ్రవరి 20: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఆదివారం అత్తాపూర్లోని విజయానంద్ స్టేడియంలో మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నంద పాండే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ డాక్టర్స్ క్రికెట్ డే నైట్ లీగ్ చాంపియన్ షిప్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ నంద పాండే, శ్రీవైదత్రవే డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వాసురాజు, మైటి స్పోర్ట్స్ కో డైరెక్టర్ నిఖిల్ సందీప్ పాల్గొన్నారు. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో మెడికోవర్ హాస్పిటల్ జట్టు ఐదు వికెట్ల తేడాతో రెయిన్బో హాస్పిటల్ జట్టుపై విజయం సాధించింది.