కాచిగూడ, ఫిబ్రవరి 20 : విద్యార్థులు కొత్త ఆలోచనలతో సమాజ ప్రగతిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ ఉప్పల శివకుమార్ పిలుపునిచ్చారు. వైశ్య హాస్టల్ ట్రస్ట్‌బోర్డు, వైశ్యహాస్టల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హాస్టల్ ప్రాంగణంలో ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్, డిగ్రీ చదువుతున్న 105 మంది పేద విద్యార్థులకు రూ.12 లక్షల స్కాలర్షిప్లు, నీట్ విద్యార్థికి ల్యాప్‌టాప్‌ను అందజేశారు. అనంతరం ఉప్పల శివకుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యంతో సాగినప్పుడే అనుకున్నది సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యకమంలో వైశ్యహాస్టల్ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ సూర్యప్రకాశ్‌రావు, కార్యదర్శి భాస్కర్‌గుప్తా, కోశాధికారి రుద్రంగి వెంకటేశ్వర్రావు, వైశ్యహాస్టల్ అధ్యక్షుడు వెంపటి మధు, ప్రధాన కార్యదర్శి ఉప్పల రాజేశ్వర్, కోశాధికారి పబ్బతి రవి ప్రసన్నకుమార్, విశ్వనాథం నగేశ్, కొండ్లే మల్లికార్జున్, చంద్రయ్య, జయప్రకాశం, జయరాములు, మేనేజర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.