చర్లపల్లి, ఫిబ్రవరి 20 : డబ్బుల కోసం వ్యాపారిని బొమ్మ తుపాకీతో బెదిరించి పారిపోయిన ఓ వ్యక్తిపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..బషీర్‌బాగ్‌కు చెందిన పసుపుల రమేశ్ యాదవ్ పీఆర్వై గోల్డ్ బైయర్స్ పేరుతో ఆన్లైన్ బంగారం వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శనివారం రోహిత్‌రెడ్డి(21) అనే యువకుడు ఆన్లైన్లో సంప్రదించి.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, 80 గ్రాముల బంగారం ఇస్తానని, రూ. 3 లక్షలు కావాలని కోరాడు. రమేశ్ అతడి మిత్రుడు శ్రీధర్‌తో కలిసి ఆదివారం సాయంత్రం సురానా చౌరస్తాకు రాగా, రోహిత్‌రెడ్డి డబ్బులు ఇవ్వాలని బొమ్మతుపాకీతో బెదిరించాడు. ఈ క్రమంలో స్థానికులు అతడిని స్తంభానికి కట్టేసి.. పోలీసులకు తెలిపారు. వారొచ్చేలోపే రోహిత్ పారిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.