సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 ( నమస్తే తెలంగాణ ) : పరిపాలనలో దేశానికి కొత్త అభివృద్ధి నమూనా నిర్మించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్’ పుస్తకాన్ని బుధవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిషరించారు. జూలూరు గౌరీశంకర్ తెలుగులో రాసిన ‘దటీజ్ కేసీఆర్’ పుస్తకాన్ని ‘కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్’ పేరుతో మంతెన దామోదరాచారి ఆంగ్లంలోకి అనువదించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పుస్తకం ఉద్యమకారులకు దారిదీపం లాంటిదని చెప్పారు.
కేసీఆర్ సమర్థతను చాటి చెప్పటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని మంత్రి పేరొన్నారు. ఈ పుస్తకావిషరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఆర్టీఐ ముఖ్య కమిషనర్ బుద్ధామురళి, కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, శుభప్రద పటేల్, ఉపేంద్ర, రామానందతీర్థ గ్రామీణ విద్యా శిక్షణా సంస్థ డైరెక్టర్ డా. ఎన్ . కిశోర్, రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం డైరెక్టర్ డా.బండి సాయన్న, రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ నామోజు బాలాచారి, పుస్తక ఆంగ్లానువాదకుడు మంతెన దామోదరాచారి, రాజకీయ సామాజిక విశ్లేషకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సామ భరత్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.