సికింద్రాబాద్, ఫిబ్రవరి 16: విద్యార్థులకు క్రీడలు జీవితంలో భాగం కావాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల సెమీఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే అధ్యాపకులు క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. క్రీడాకారులందరూ భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో పాటు పలువురు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.