జూబ్లీహిల్స్ జోన్ బృందం, ఫిబ్రవరి16 : వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి తెలంగాణలో ప్రభుత్వ దవాఖానలకు మహర్దశ తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం కార్పొరేటర్లు సీఎన్‌రెడ్డి, దేదీప్య విజయ్, రాజ్‌కుమార్ పటేల్‌లతో కలిసి నియోజకవర్గంలోని బస్తీ దవాఖానలతో పాటు ఎర్రగడ్డలోని ఛాతీ దవఖానలో ఆయన రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా పేద ప్రజల అభ్యున్నతికి కోసం చేస్తున్నారని.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళరావునగర్ నుంచి వేణుగోపాల్‌యాదవ్, రహ్మత్‌నగర్ నుంచి మహ్మద్ మన్సూర్, శ్రీనివాస్, నాగరాజు, ఒమెర్.. యూసుఫ్‌గూడ నుంచి నీలం సంతోష్ముదిజార్, ఐలపాక నర్సింగ్‌దాస్, కల్యాణి, గీతాగౌడ్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.