అబద్దం: చార్మినార్, ఫిబ్రవరి 15 : చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల కోసం ఏర్పాటు చేస్తున్న గోతుల్లో రాళ్లు కనిపించాయి. తవ్వకాల్లో సొరంగ మార్గాలు భయట పడ్డాయని, గోతుల్లో కనిపించిన రాళ్లను మెట్లుగా భావించి కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఇది తెలుసుకున్న స్థానిక ఎంఐఎం నాయకులు ఆందోనళకు దిగారు.
నిజం: చార్మినార్ నాలుగు మినార్లతోపాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టినట్లు అర్కియాలజీ అధికారులు ఎస్.ఏ.స్మిత. ఎస్.కుమార్, రాజేశ్వరి తెలిపారు. చార్మినార్ కట్టడాన్ని పరిరక్షించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. మినార్లకు పై అంతస్థుల నుంచి పునాదుల వరకు కాపర్ కేబుళ్లను అమర్చుతున్నామన్నారు. తవ్వకాల్లో సొరంగ మార్గం ఏమీ లేదని.. కేవలం రాళ్లుమాత్రమేనని తెలిపారు.