ఖైరతాబాద్/బంజారాహిల్స్, ఫిబ్రవరి 15: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంగళవారం అన్నదానం కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.సోమాజిగూడ డివిజన్ పరిధిలోని హరిగేట్‌లో చెవిటి,మూగ విద్యార్థులతో పాటు అంగన్వాడీ పిల్లలకు స్థానిక కార్పొరేటర్ వనం సంగీతా శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ దుస్తులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడు రోజల పాటు పండుగలా జరుపుతున్నామన్నారు.
నేడు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు హాజరవుతున్నారన్నారు. తాను స్వయంగా వందకు పైగా రక్తదానం చేశానన్నారు. 17న హరితహారం, సీఎం కేసీఆర్ పేరిట యజ్ఞాలు, పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ నాయకుడు వనం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, కె. రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా పంజాగుట్ట నిమ్స్ దవాఖానలో రోగులకు కార్పొరేటర్ వనం సంగీత యాదవ్‌తో కలిసి పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, నాయకులు కె. నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాపురి కాలనీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు, పేదలకు చీరెలను పంపిణీ చేశారు.