హిమాయత్‌నగర్, ఫిబ్రవరి15: అన్ని విధాలుగా హిమాయత్‌నగర్ డివిజన్‌ను తీర్చి దిద్దేందుకు దశల వారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం కింగ్‌కోఠిలో అర్హులైన 8మంది లబ్ధిదారులకు మంజురైన షాదీ ముబారక్ చెక్కులను స్థానిక కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, మాజీ కార్పొ రేటర్ హేమలతయాదవ్తో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దత్తానగర్‌లో బస్తీ వాసులకు ఇబ్బంది లేకుండా పెండింగ్‌లో ఉన్న రిట్నరింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
షేర్ఘాట్లో కమ్యూనిటీ హాల్‌తో పాటు బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని, హిమాయత్‌నగర్,నారాయణగూడలో డ్రైనేజీ, సీ.సీ రోడ్ల నిర్మాణ పనులను త్వరల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి, నాయకులు జె.బాబుయాదవ్, డి.రాజేందర్ కుమార్, నందు,మహ్మద్సర్ఫరాజ్, యతిరాజ్, అశోక్ , బీజేపీ నాయకులు జైస్వాల్,నర్సింగ్‌గౌడ్, పందిర్ల ప్రసాద్, నాంపల్లి వీఆర్వో నరేష్ పాల్గొన్నారు.