జూబ్లీహిల్స్,ఫిబ్రవరి15: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్‌రెడ్డి, బాబాఫసియుద్దీన్, దేదీప్య విజయ్, సంగీతా యాదవ్‌లతో కలిసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి భోజనం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధిలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపినట్లు తెలిపారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దార్శనికుడని కొనియాడారు.
నేడు రక్తదానశిబిరాలు, గురువారం మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామని తెలిపారు. యూసుఫ్‌గూడలో నీలం సంతోష్ ముదిరాజ్, ఐలపాక నర్సింగ్‌దాస్, గీతా గౌడ్, రహ్మత్‌నగర్‌లో మహ్మద్ మన్సూర్, నందూనాయక్, శ్రీనివాస్, నాగరాజు, బోరబండలో కృష్ణమోహన్, ఎర్రగడ్డలో సంజీవ, శ్రీనగర్ కాలనీలో అప్పూఖాన్, తన్నూఖాన్, శరత్ గౌడ్, మధు యాదవ్, నాగమణి, అంబికా, శిరీష, వెంగళరావునగర్‌లో వేణుగోపాల్ యాదవ్, శ్యామ్‌రావు, వేణు, చిన్నా, రమేశ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సనత్‌నగర్‌లో..
అమీర్‌పేట్: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు సనత్‌నగర్ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం తొలిరోజున నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ, బుద్ధి మాంద్యులకు అన్నదానం, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో నిర్వహించారు. షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు దుర్గంప్రదీప్కుమార్,నాయకులు మధుసూదన్,సయ్యద్ సజ్జాద్,బాలకృష్ణ,మురళీ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.