సికింద్రాబాద్, ఫిబ్రవరి 15: అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన కారణజన్ముడు సీఎం కేసీఆర్ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
న్యూ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్, కార్ఖానా మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హాట్స్, తిరుమలగిరిలోని మహాంకాళి ఆలయం, బొల్లారం, రసూల్‌పురాలోని ఇందిరమ్మనగర్లలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే వ్యక్తి కాదు 4 కోట్ల ప్రజల గుండె చప్పుడు అని అన్నారు.
నేడు కంటోన్మెంట్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. అదే విధంగా మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హాట్స్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, లోక్‌నాథ్, ప్రభాకర్, శ్యామ్‌కుమార్‌లతో పాటు టీఆర్ఎస్ నేతలు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, సురేష్, శ్రీధర్, ఎనముల విజయ్‌తో పాటు టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా మెట్టుగూడ డివిజన్లోని సెయింట్ అంథోనీస్ చర్చిలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ సునీత, టీఆర్ఎస్ నేతలు నర్సింగ్‌రావు, వెంకటేశ్, శ్రీకాంత్, కృష్ణ, హరి, సుధాకర్ పాల్గొన్నారు.