ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 15: తార్నాక డివిజన్లోని ఆర్యనగర్‌లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతను కోరారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆమెకు వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆర్యనగర్ వాసులు మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థతో తరుచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పాత మంచినీటి పైపులైన్‌తో పాటు నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని వాపోయారు. సీసీ రోడ్లు లేకపోవడంతో వాహనదారులు సమస్యలు చవిచూస్తున్నారన్నారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా స్థానికులకు అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూ సీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి పాల్గొన్నారు.