ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 15: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఉస్మానియా యూనివర్సిటీలో అధికారికంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ శంకర్‌నాయక్, ఐఆర్ఎస్ అధికారి జీవన్‌లాల్, తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్ హన్మంతునాయక్, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్ తదితరులు హాజరయ్యారు.
ఎన్సీసీ గేటు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మహాభోగ్ భండార్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో సదస్సును నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యప్రదర్శనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలలో పలువురు వక్తలు మాట్లాడుతూ సేవాలాల్ జీవిత చరిత్రను వివరించారు. జాతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహామనిషి సేవాలాల్ అని కొనియాడారు. జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో…
సేవాలాల్ మహారాజ్ జయంతిని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఏబీవీపీ భాగ్యనగర్ విభాగ్ కన్వీనర్ కమల్ సురేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్, ఏబీవీపీ సంభాగ్ ప్రముఖ్ ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ ప్రసాద్, ప్రొఫెసర్ శ్రీనునాయక్, ప్రొఫెసర్ వివేక్వర్ధన్ హాజరైసేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు.