హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కు మార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సినీనటి లహరి షరి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో సినీనటి లహరి షరి మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాబోయే భావి తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం ద్వారా స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్క లు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం, నటరాజ్ మాస్టర్, సరయు, ప్రియాంక సింగ్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.