ఇలా.. అనేక పథకాలను పేదలకు అందజేస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలిచి, రాష్ర్టాన్ని దేశంలోనే నం.1 స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణకు పండుగ వచ్చింది. మూడు రోజుల పాటు ప్రతి వీధి సంబురాల్లో మునిగితేలనున్నది. చారిత్రక పథకాలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పది కాలాలు చల్లగా ఉండాలని తెలంగాణ తల్లి దీవిస్తున్నది. నిండు నూరేళ్ల పాటు ప్రజాసేవ చేయాలని జనం ఆకాంక్షిస్తున్నారు.
సికింద్రాబాద్, ఫిబ్రవరి 14 : ప్రత్యేక రాష్ట్ర సాధన జాతిపిత, కారుణజన్ముడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, నేతలు సంబురంగా జరుపుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం కంటోన్మెంట్‌కు చెందిన బోర్డు మాజీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సాయన్న న్యూ బోయిన్‌పల్లిలోని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కంటోన్మెంట్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ మేరకు మంగళవారం నియోజకవర్గం పరిధి బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్, రసూల్‌పురాలోని ఇందిరమ్మనగర్, కార్ఖానాలోని మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హట్స్, 108 బజార్, లాల్‌బజార్ మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం, బొల్లారంతో పాటు జూబ్లీ బస్‌స్టేషన్, మోండా డివిజన్లోని వృద్ధాశ్రమాలు, దవాఖానల్లో పండ్లు పంపిణీ చేపట్టడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. దీంతో పాటు 16న పికెట్‌లో మెగా రక్తదాన శిబిరం, 17న నియోజకవర్గంలోని ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, శ్యామ్‌కుమార్, నళినికిరణ్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, దేవులపల్లి శ్రీనివాస్, శ్రీకాంత్, సరిత, తదితరులు పాల్గొన్నారు.
కొట్లాడి సాధించిన తెలంగాణను
కోటి ఎకరాల మాగాణిగా మార్చిన మహనీయుడు..
తెలంగాణ గొంతు తడిపిన అపర భగీరథుడు..
చీకట్లను చీల్చి.. 24 గంటల పాటు ప్రతి ఇంటా వెలుగులు నింపిన చల్లని చంద్రుడు..
ప్రతి అవ్వకు ‘ఆసరా’గా నిలుస్తున్న పెద్ద కొడుకు..
దళితుల మోములో వెలుగులు నింపిన దళిత బాంధవుడు..
రైతును రాజుగా మారుస్తున్న రైతు బంధువు..
ఆడ బిడ్డలకు కల్యాణ కానుకను అందజేస్తున్న మేనమామ..