చిక్కడపల్లి, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీల్లో నియోజకవర్గం వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. సోమవారం గాంధీనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 68వ జన్మదిన సంబురాలను ఘనంగా జరుపుకోవడంతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15న ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో పండ్లు, ఆహారం, దుస్తుల పంపిణీ చేస్తామన్నారు. 16న టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, 17న సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, గాంధీనగర్ , రాంనగర్, కవాడిగూడ, అడిక్‌మెంట్, ముషీరాబాద్ డివిజన్ల్ పార్టీ అధ్యక్షులు ఎం.రాకేశ్, రావులపాటి మోజస్, శ్యామ్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ ప్రసాద్, నాయకులు శ్రీకాంత్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్‌రెడ్డి, శ్యామ్ సుందర్, సాయి, సురేందర్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.