సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించేందుకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న బహదూర్‌పల్లి, తొర్రూర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మొదటి దశలో భాగంగా మేడ్చల్ జిల్లా కండ్లకోయ సమీపంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లిలో 101 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల పరిధిలోని తొర్రూర్‌లో 223 ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో ఉప్పల్ భగాయత్‌లో హెచ్ఎండీఏ చేపట్టిన తరహాలోనే పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ప్లాట్ల వేలం పారదర్శకంగా, ఆన్లైన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీతో కలిసి నిర్వహిస్తున్నారు.
ప్రత్యేకతలు
100 శాతం ఎటువంటి చిక్కులు లేని క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి
సత్వర నిర్మాణానికి అనువైన బహుళ ప్రయోజన ప్లాట్లు
భూమి వినియోగానికి సంబంధించిన మార్పులు చేయాల్సిన అవసరం లేదు
ముఖ్యమైన ప్రాంతాల మధ్యలో లేఅవుట్లు
సమగ్ర మౌలికవసతుల కల్పనలో భాగంగా చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి అన్ని పనులు 18 నెలల్లో పూర్తవుతాయి.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ప్రభుత్వ లేఅవుట్లలో పార్కులు, మిగతా సౌకర్యాల ఏర్పాటుకు స్థలాలు కేటాయింపు
ప్లాట్ల వేలంకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు ప్రతి సైటుకు సంబంధించిన ఈ బ్రోచర్లు హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నం. 9154843213, 7702743488
ఈ మెయిల్ ద్వారా వివరాల కోసం daoemu@gmail.com, eohmda@gmail.com, www.auctins.hmda.gov.in