బంజారాహిల్స్,ఫిబ్రవరి 14: వెంకటేశ్వరకానీ డివిజన్ పరిధిలో రూ.3.45 కోట్లతో చేపట్టనున్న నాలాల ఆధునీకరణ పనులను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ..నగరంలో వరదనీటి సమస్యలను పరిష్కరించేందుకు నాలా డెవలప్మెంట్ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టామన్నారు. వరదనీటి ప్రవాహాలను తట్టుకునేలా నాలాలను పటిష్టం చేసేందుకు పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్‌కుమార్, స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డి,డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు రవి, మాదాస్ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని అజమ్ బహుదూర్నగర్లో రూ.8లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ పి.విజయారెడ్డి ప్రారంభించారు. సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..అజమ్ బహుదూర్నగర్లో సుమారు 90మీటర్ల మేర రోడ్డు పాడైపోవడంతో కొత్త రోడ్డును మంజూరు చేయించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ చైతన్య, ఏఈ చరణ్‌తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు సాధిక్, మురళి, ఫయాజ్, శ్యామ్,. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.