మల్కాజిగిరి, ఫిబ్రవరి 13: ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరిస్తున్నామని, దీనిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. ఆదివారం సర్కిల్ కార్యాలయంలో ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరిస్తున్నామని.. దీంతో ఇండ్ల యజమానులు పన్నులు సకాలంలో చెల్లించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ఆస్తిపన్ను వివరాల జిరాక్స్ కాపీలను తీసుకువస్తే అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నా రు. మార్చి చివరి వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక అధికారులు కార్యాల యంలో అందుబాటులో ఉంటారన్నారు. ఆస్తిపన్నులు చెల్లించకుండా బకాయి పడినవారికి రెడ్ నోటీసులు జారీ చేశామని అన్నారు. సకాలంలో పన్నులు చెల్లించాలని, పన్నులు చెల్లించని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదివారం రెండు ఇండ్ల ఆస్తిపన్ను సమస్యను పరిష్కరించామని, ఈ అవకాశాన్ని ఇండ్ల య జమానులు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంటవరకు ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. వాల్యుయేషన్ ఆఫీసర్ నర్సింగరావు, టాక్స్ ఇన్స్పెక్టర్లు శ్రీ కృష్ణ, సత్తిబాబు పాల్గొన్నారు.