ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 13: కేంద్రప్రభుత్వం దేశంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని ఎస్ఎఫ్ఐ మండిపడింది. కేంద్రం తక్షణమే తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ, సామాజిక మంత్రిత్వ శాఖ అందిస్తున్న టాప్‌క్లాస్ స్కాలర్‌షిప్‌లలో ఓయూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్, నాయకులు అరవింద్, విజయ్‌నాయక్, కరణ్, శ్రీను, రమేశ్, సతీశ్, నరేశ్, వినోద్, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.