చిక్కడపల్లి, ఫిబ్రవరి13: పద్మశాలిల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రేటర్ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ నియామక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బూర మల్లేశం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కోకపేటలో రెండెకరాల స్థలంతోపాటు రూ.5 కోట్లు కేటాయించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం సారధ్యంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు జరుగాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు గోశిక యాదగిరి, సేవ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పేర్ల పురుషోత్తం, వనం సుమన్, మహిళా నాయకురాలు ఊర్మిళ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ, ప్రభు, సత్యనారాయణ పాల్గొన్నారు.