బంజారాహిల్స్,ఫిబ్రవరి13: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బం జారాహిల్స్ రోడ్ నం.12లోని సయ్యద్‌నగర్ లో నివాసం ఉంటున్న సయీద్ బిన్ మాబ్రుక్ (40)ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. 2005 లో అతడికి షాహీన్బేగంతో వివా హం కాగా వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్యగొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 9న భర్తతో గొడవపడిన షాహీన్ బేగం కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. శనివారం రాత్రి భార్యను తీసుకువచ్చేందుకు సయీద్ బిన్ ఆమెవద్దకు వెళ్లినా ఇంటికి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన సయీ ద్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం కుమార్తె అమీనాబేగం చూడగా తండ్రి మృతదేహం కనిపించింది.మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.