అమీర్‌పేట్, ఫిబ్రవరి 13 : కాలనీ వాసులు తమ సమస్యలపై చర్చించుకునేందుకు వీలుగా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. అమీర్‌పేట్ డివిజన్లోని ఎస్ఆర్నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇటీవల ఏర్పడింది. కాగా డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి నేతృత్వంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్, గౌతమ్రెడ్డిలతో పాటు అసోసియేషన్ ప్రతినిధులు రాజా, కోటేశ్వర్రావు, ఆత్రేయ, శివాజీ, రమేశ్, కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వీరారెడ్డి, సంపత్, స్టీవెన్ రాబర్ట్ ఆదివారం మంత్రి తలసానిని మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కాలనీలో అడిగిన వెంటనే పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడమే కాకుండా, ఫుట్‌పాత్ నిర్మాణంతో పాటు, మొక్కలు పెంపకానికి వీలుగా చక్కటి నిర్మాణాలు చేసినందుకు కాలనీ వాసుల తరపున అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి తలసానికి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ కాలనీ నివాసితులు తమ సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ఎప్పటి కప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు.