చిక్కడపల్లి, ఫిబ్రవరి12 : దేశవ్యాప్తంగా ఉన్న 43 గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులను కలిపి నేషనల్ రూరల్ బ్యాంకుగా మార్చాలని ఆలిండియా రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ గ్రామీణ బ్యాంక్ వికాస్ ఆఫీసర్స్ అసోసియేషన, ఏపీ గ్రామీణ బ్యాంక్ వికాస్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఐదో త్రైవార్షిక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్, బ్యాంకు జీఎం సుకుమార్, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.బిక్షమయ్య, అధ్యక్షుడు ఎం.రాం బాబు, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రకాశం, అధ్యక్షుడు రాజయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ సంజీవరావు, గోపాల్ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.