మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 12 : గేట్‌వే ఐటీ టవర్‌తో హైదరాబాద్ పడమరలో అభివృద్ధి చెందిన ఐటటీ పరిశ్రమ ఉత్తరానికి విస్తరిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌కు ఈ నెల 17న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కండ్లకోయకు ఐటీ హబ్ రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. కండ్లకోయలో ఇప్పటికే కేటాయించిన 5 లక్షల ఎస్ఎఫ్టీ స్థలానికి సరిపడా వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రెండు, మూడో ఫేజ్‌లో కూడా ఇక్కడే ఐటీ అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కండ్లకోయ ఐటీ హబ్ ఏర్పాటు వెనుక టీఎస్ఐఐసీ ఎండి నర్సింహరెడ్డి, ఐటీ సీఆర్వో అమర్నాథ్, కేఐటీఈఏ అధ్యక్షుడు వెంకట్ సహకారం ఎంతో ఉందని చెప్పారు.
17 శాతం ఐటీ అభివృద్ధి ..
హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ ప్రతి ఏటా 16 నుంచి 17 శాతం అభివృద్ధిని నమోదు చేస్తుందని టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు ఉండేవని, ప్రస్తుతం 6.5 లక్షల మంది పని చేస్తున్నారని చెప్పారు. కండ్లకోయ- మేడ్చల్ జంక్షన్లో 10 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు అవుతుందని, స్థలాన్ని ఇచ్చిన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, టీఆర్ఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేంద్ రెడ్డి, వైస్ చైర్మన్లు ప్రభాకర్, చీర్ల రమేశ్, ఐటీ సీఆర్వో అమర్నాథ్, గుండ్లపోచంపల్లి కమిషనర్ లావణ్య, లాస్య ఇన్ఫోటెక్ ఎండీ, కేఐటీఈఏ అధ్యక్షుడు వెంకట్, నాయకులు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహరెడ్డి, జగన్ రెడ్డి, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, నరేందర్ రెడ్డి, దయానంద్ యాదవ్, సంజీవగౌడ్, శేఖర్‌గౌడ్, సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, టీఎస్ఐఐసీ జీఎం మాధవి, మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.