సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 12 : మేడారం జాతరలో సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో లక్ష మాస్కులను పంపిణీ చేస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంపత్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కోఠిలోని ఐఎంఏ హాల్లో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ గట్టు శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సి సురేంద్రనాథ్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నా జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తుండడంతో మళ్లీ విజృంభించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఐఎంఏ ప్రతినిధి ద్వారా లక్ష మాస్కులను వరంగల్ జిల్లా శాఖ ద్వారా ములుగు కలెక్టర్‌కు అందజేసినట్లు ఆయన వివరించారు.