హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 10: దేశ వ్యాప్తంగా బీసీల కుల గణన చేపట్టాలని మార్చి 21న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని బీసీ భవన్లో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ కులాల గణాంకాలు లేకపోవడంతో దేశంలో 52 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదన్నారు. బీసీల జనగణన కోసం రాజకీయాలకు అతీతంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి మార్చి 22, 23వ తేదీల్లో పార్లమెంట్‌ను ముట్టడింపజేస్తామని చెప్పారు.
బీసీల కుల గణన చేయకపోతే బీజేపీకి రాజకీయ సమాధి ఖాయమన్నారు. సమావేశంలో సంఘం జాతీయ సలహాదారుడు పల్లె ఉపేందర్ గౌడ్, గౌరవ సలహాదారులు శ్రీనివాస్, సూర్యనారాయణ, బత్తుల సిద్ధేశ్వర్, నాయకులు లింగమూర్తి, సతీష్ కుమార్ గౌడ్, సత్యనారాయణ, ప్రశాంత్ యాదవ్, రాజ్ కుమార్, దేవేందర్, సత్య గౌడ్, భిక్షపతి, సత్యం, సౌజన్య, స్వప్న, కిషన్‌రావు, దేవరకొండ నరేష్‌చారి, రాజు యాదవ్, రమేష్, భరత్ పాల్గొన్నారు.