సికింద్రాబాద్, ఫిబ్రవరి 10: మహా నగరంలో లోతట్టు ప్రాంతాలు, ముంపు సమస్యలకు తెలంగాణ ప్ర భుత్వం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. కంటోన్మెంట్ పరిధిలో అనాదిగా పేరుకుపోయిన సమస్యకు మంత్రి కేటీ రామారావు పరిష్కరించేందుకు పూ నుకున్నారు. ఇందులో భాగంగా ఎప్పటి నుంచో బోర్డు పరిధిలోని పలు ప్రాంతాలు ప్యాట్నీ నాలా ఆధునీకరణ చేయకపోవడంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి లో తట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
ఈ క్రమం లో రెండేళ్ల క్రితం నగరంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా రసూల్‌పురా, పికెట్, బాలంరాయి వంటి ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అప్పటికప్పుడు దీంతో అప్పట్లో ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కు ల మహేశ్వర్‌రెడ్డిలు ప్యాట్నీ నాలా పనుల ఆధునీకరణకు సంబంధించి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రత్యక్షంగా బేగంపేట ప్యాట్నీ నాలాను పరిశీలించి ఎమ్మెల్యే సాయన్నతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, బోర్డు అధికారులతో జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే గత 25 ఏండ్ల నిరీక్షణకు తెరదింపుతూ ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రి కేటీఆర్ ఈ పనులకు రసూల్‌పురాలో శనివారం శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్‌లు నాలా పరివాహక ప్రాంతాన్ని గురువారం సందర్శించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.
స్థానికుల్లో సంతోషం…
బోయిన్పల్లి నుంచి రామన్నకుంట మీదుగా రసూల్‌పురా వెంట ఉన్న నాలా అధునీకరణ పనులు ప్రారంభం కానుండటంతో ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజ ల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. 1997లో నాలా వెం బడి ఉన్న లక్ష్మీకుంట కాలనీ, పీ అండ్ టీ కాలనీల మ ధ్య రాకపోకలకు అప్పట్లో సర్కారు బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.10 లక్షలను కేటాయించింది. దీం తో పాటు 2011లో విమాన్‌నగర్, బీహెచ్ఎల్ కాలనీ, పైగా కాలనీల్లో మరో రెండు బ్రిడ్జిల నిర్మాణం కోసం అ ప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న సోమేశ్ కుమార్ నేతృత్వంలో నాలా అధునీకరణకు సుమారు రూ.3 కో ట్లను విడుదల చేశారు. ఇబ్బందులు అలాగే ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ముందుచూపుతో సుమా రు రూ.10 కోట్ల వ్యయంతో ముంపునకు గురికాకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
ముంపు సమస్య లేకుండా కృషి…
నాలా అధునీకరణతో కంటో న్మెంట్ వాసులకు ముంపు సమస్య తప్పినట్లే. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ పనులకు చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఆధునీకరణ పనులకు సుమారు రూ.10 కోట్లు కేటాయించారు. అయితే, ఈ పనులను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. రసూల్‌పురా పరిధిలో ఉన్న పలు కాలనీలకు ముంపు బాధ లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కంటోన్మెంట్ సమస్యలపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది.
– జి.సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
స్థానికులకు ఇబ్బందులు తొలిగినట్లే..
రెండేండ్ల కింద కురిసిన భారీ వర్షాలతో వరదలు విపరీతంగా రావడంతో రసూల్‌పురా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్యాట్నీ నాలా అధునీకరణ పనులు చేపట్టకపోవడంతో నాలా పొంగిపొర్లి ఇండ్లలో నీరు చేరడంతో ఇక్కట్లు తప్పలేదు. దీనిని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర సర్కారు నాలా అధునీకరణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నది. కంటోన్మెంట్‌లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎవరు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆధునీకరణ పనులను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభిస్తారు.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఇన్చార్జ్, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్