కుత్బుల్లాపూర్/గాజులరామారం,, సెప్టెంబర్ 4: ప్రజలకు సుస్థిరమైన మెరుగైన జీవన ప్రమణాలను కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరవ వార్డు శాంతినికేతన్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి నల్లాను చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్తో పాటు స్థానిక కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం దూలపల్లి నాగార్జున డ్రీమ్లాండ్లో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే వివేకానంద్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కొంపల్లి నుండి దూలపల్లి మీదుగా బహదూర్‌పల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. రూ.13 కోట్లతో వరద నీటి సమస్య లేకుండా ఎన్డీపీ ఆధ్వర్యంలో నాలా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నెలరోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల వంటి అనేక రకాల సమస్యలను వెనువెంటనే పరిష్కరించేలా అన్నీ రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సోమేశ్యాదవ్, కాలనీ అసోషియేషన్ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
గాజులరామారం 125 డివిజన్ పరిధిలో వీనస్ రాక్హైట్స్ కాలనీలో రూ.53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైను ఆదివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదిగా ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధిపనులకు నిధుల కొరత లేకుం డా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అన్నీ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో సైతం అభివృద్ధి పనులు మొదలుపెడుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సుదర్శన్‌రెడ్డినగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో కాలనీవాసుల సౌజన్యంతో రూ.1.70 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, కాలనీ అసోషియేషన్ అధ్యక్షుడు సాయివర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.