సికింద్రాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణపై మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తంచేశారు. పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సాయన్న, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీకి భారీగా తరలివచ్చారు. కంటోన్మెంట్‌లోని బాలంరాయి పంపుహౌజ్ నుంచి నల్లజెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. అన్నానగర్ చౌరస్తా, తాడ్బంద్, తిరుమలగిరి, కార్ఖానా, జేబీఎస్ వరకు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. జేబీఎస్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ మాట్లాడుతూ తెలంగాణపై బీజేపీ నేతల అక్కసు మరోసారి స్పష్టమైందన్నారు. అభివృద్ధిని ఓర్వలేక మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, మాజీ బోర్డు సభ్యులు ప్రభాకర్, పాండు యాదవ్, లోకనాథం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నర్సింహ ముదిరాజ్, పిట్ల నాగేశ్, ముప్పిడి మధుకర్, దేవులపల్లి శ్రీనివాస్, ఉమేశ్, కుమా ర్ ముదిరాజ్, దీనానాధ్ యాదవ్, తేజ్ పాల్, వినోద్, నర్సింహ రావు, రవి కుమార్, కిరణ్, శ్రీహరి, భాస్కర్ ముదిరాజ్, నర్సింహ, ఆంజనేయులు, గౌస్, నూర్, పనస సంతోష్, సదానంద్ గౌడ్, మురళి యాదవ్, నాగినేని సరితా, లతా మహేందర్, సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని ఓర్వలేకనే..
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 9: రాష్ట్రంగా ఏర్పడిన కొన్నేండ్లలోనే అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతున్నదని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నల్లజెండాలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ మద్దతిస్తేనే రాష్ట్రం ఏర్పడలేదని, దేశంలోని 38 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి కేసీఆర్ రాష్ట్రం సాధించారని అన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ఇది బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదని అన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌కు వరుస కడుతుంటే బీజేపీ నాయకులు ఓర్వలేక ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటుకు పలు రాష్ర్టాల నుంచి ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్‌తో సంప్రదింపులు జరుపుతుంటే మోడీ పీఠం కదులుతున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, ప్రవీణ్‌రెడ్డి, గుండగాని కిరణ్‌గౌడ్, కడారి స్వామి, కోతి విజయ్, వీరబాబు, రఘురాం, ప్రధాన కార్యదర్శులు గదరాజు చందు, శ్రీకుమార్, శిగ వెంకట్, నవీన్‌గౌడ్, కృష్ణ, హరిబాబు, కార్యదర్శులు వేల్పుకొండ వెంకటేశ్, భాస్కర్, రవి, జంగయ్య, కాటం శివ, రమేశ్‌గౌడ్, నాగరాజు, మిథున్, రేణు, నరేశ్, క్రాంతి, ప్రశాంత్, సురేశ్, అవినాశ్, సునీల్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో…
నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో ఎన్సీసీ గేటు సమీపంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు సాయిబాబా, భాస్కర్, సోహైల్, వెంకట్, యాసర్, హరి, అరవింద్, పవన్ పాల్గొన్నారు.
మోడీపై వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాలలు
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తార్నాక డివిజన్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. లాలాపేట నుంచి తార్నాక వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆలకుంట హరి ఆధ్వర్యంలో ఓల్డ్ డెయిరీ ఫామ్ రోడ్డు చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూనే అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎన్నో బలిదానాలతో ఏర్పడిన రాష్ర్టానికి వ్యతిరేకంగా మాట్లాడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.