తెలుగుయూనివర్సిటీ, ఫిబ్రవరి 9 : నూతన నటీనటులతో సరికొత్త అంశంతో వెబ్ సిరీస్‌ను ప్రారంభించడం అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఓజస్వి ఎంటర్టైన్మెంట్ సారథ్యంలో యువ దర్శకుడు మానస్ దండ నాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ద కనెక్షన్’ వెబ్‌సిరీస్‌ను బుధవారం నాంపల్లిలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. చిత్ర దర్శకులు మానస్ మాట్లాడుతూ గంగా నదిని ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి చుక్కా అవినాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.