జగదేవ్‌పూర్ ఫిబ్రవరి 7: సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో కోట్లు వెచ్చించి ఆలయాలకు మహర్ధశ తీసుకొచ్చారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ప్రసిద్ధ్ద కొండపోచమ్మ దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేండ్లుగా తాను కుటుంబ సమేతంగా అమ్మవాని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు. కొండపోచమ్మ దేవాలయం పేరున భారీ ప్రాజెక్టుకు కొండపోచమ్మ సాగర్‌గా నామకరణం చేయడంతో అమ్మవారి ఆలయం దేశం నలుమూలల ప్రసిద్ధి చెందిందన్నారు. అదేవిధంగా కొండపోచమ్మ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారి వెంకట్‌రెడ్డి, అర్చకులు లక్ష్మణ్, తిరుపతి, గోవర్ధన్, సిబ్బంది, కనకయ్య, హరి, చిన్న, ఏసు, చందు తదితరులు ఉన్నారు.
బాలిక కిడ్నాప్‌నకు యత్నించిన వ్యక్తి రిమాండ్
ఓ బాలికను కిడ్నాప్‌నకు యత్నించిన యువకుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ రమేశ్ కథనం ప్రకారం…ఒడిశా రాష్ర్టానికి చెందిన మనోరంజాన్ జాన్ (20) ఆరు నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డులోని పాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. రెయిన్ బజార్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి మౌలాలి దర్గా వద్దకు వెళ్లి సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 10వ నంబర్ ప్లాట్ ఫారంపై వేచి ఉంది. ఆమె కుమార్తె ఆడుకుంటుండగా అప్పటికే ప్లాట్ ఫారం పైకి వచ్చిన మనోరంజన్ జాన్ ఆ బాలికను ఎత్తుకెళ్లేందుకు యత్నించడంతో గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడి పై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.