సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి సూచించారు. సోమవారం హిమాయత్‌నగర్,నారాయణగూడలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హిమాయత్‌నగర్,ఫిబ్రవరి7: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి సూచించారు. సోమవారం హిమాయత్‌నగర్,నారాయణగూడలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో నారాయణగూడ పీఎస్ సీఐ బి.గట్టుమల్లు, ఎస్సైలు నరేష్,సంధ్య, జ్యోతి,శిరీష, ప్రదీప్ పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గం వైపు నడవాలని హిమాయత్‌నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి సూచించారు. నారాయణగూడ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ముద్రించిన వాల్ పోస్టర్‌ను సోమవారం నారాయణగూడలో ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో నారాయణగూడ ఎక్సైజ్ పీఎస్ ఎస్సై ఎం.శివకృష్ణ పాల్గొన్నారు.