వెంగళరావునగర్, ఫిబ్రవరి 7: తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై స్వప్నారెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం..శ్రీకాకుళం జిల్లా చాకలి వీధికి చెందిన నాగిశెట్టి, సాయి దంపతులు. వీరికి గణేశ్, లిఖిత అనే ఇద్దరు పిల్లలున్నారు. కూలీ పనులు చేసుకుంటూ భార్యాభర్తలు అమీర్పేట ధరంకరం రోడ్డులో నివాసం ఉంటున్నారు. కాగా సాయి తరచూ సెల్ఫోన్ మాట్లాడుతుండటంతో భర్త మం దలించడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఈ నెల 2న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. భర్త నాగిశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుట్లు ఎస్సై తెలిపారు.