బడంగ్‌పేట, ఫిబ్రవరి 6: ప్రణాళికా బద్ధంగా కాలనీలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నైన్హిల్స్ కాలనీ, లిబ్రా కాలనీ, శ్రీమారుతీనగర్, సప్తగిరి, శ్రీనిలయ, రత్న, జనప్రియ, ఆర్ఎంఆర్ కాలనీల్లో రూ.2.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ ఆధ్వర్యంలో మంత్రికి స్వాగతం పలికారు. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిని, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్‌ను, మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. 28వ డివిజన్లో రూ.2.24 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి పైపులైన్లు, కమ్యూనిటీ హాల్, పార్కుల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. అవసరమైన నిధులు కేటాయిస్తున్నారన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ట్రంక్ లైన్ ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. శంకుస్థాపన చేసిన పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, పెద్ద బావి శోభా ఆనంద్‌రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, యాతం పవన్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ బడంగ్‌పేట అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కాలనీవాసులు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు తదితరులు ఉన్నారు.
ఇటీవల రూ.371 కోట్ల పనులకు శంకుస్థాపన
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతుల మీదగా రూ.371 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. రోడ్ల విస్తరణ, స్టేడియం నిర్మాణం, ఇంటి గ్రేటెడ్ మార్కెట్, ప్రజా భవనం అన్ని ఒకే సముదాయంలో నిర్మాణం జరుగుతున్నాయన్నారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.