కందుకూరు, ఫిబ్రవరి 6 : ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక భయంతో విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్‌రెడ్డి, సర్పంచ్ గొరిగే కళమ్మ రాజు అంజయ్య, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, టైరు పాండు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.