శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 6: గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని హమీదుల్లానగర్ గ్రామ సర్పంచ్ సతీశ్యాదవ్కు రూ.10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్( నిధులు) కేటాయిస్తున్న ఆర్డర్ కాఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రూ.10 లక్షల నిధులు కేటాయించడంపై హమీదుల్లానగర్ సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరడంతో స్పందించిన ఎంపీ రూ.10 లక్షలు కేటాయించారు. సర్పంచ్‌తో పాటు గ్రామ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు.