మైలార్దేవ్పల్లి,ఫిబ్రవరి6: పలు కాలనీల్లోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లన్నీ గుంతలుగా మారాయి.కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని మార్కండేయనగర్ కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.20 సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్లు ఉన్నప్పటికీ డ్రైనేజీ లైన్ కోసం అన్ని గల్లీల్లో రోడ్లను తవ్విన కాంట్రాక్టర్ అనంతరం సీసీ రోడ్డు వేయకుండానే చేతులు దులుపుకున్నాడు.
దీంతో కాలనీల్లో రోడ్లు గుంతలుగా మారాయి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు అన్ని రోడ్లను పరిశీలించి నూతనంగా సీసీ రోడ్లు వేయాలని కోరుతున్నారు.