కాచిగూడ, ఫిబ్రవరి 5 : ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించకుండా సమర్థవంతంగా ఎదుర్కొనడంతో కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు అన్నారు. మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలోని మున్నూరుకాపు మెడికల్ అండ్ హెల్త్ సెంటర్లో నూతనంగా డయాగ్నస్టిక్ సెంటర్‌ను శ్రీనివాస్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరుకాపులు విద్య, వైద్య రంగంలో రాణించి ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు విద్యార్థి వసతి గృహం చైర్మన్ మ్యాడం వెంకట్రావు, ట్రస్టీలు గంప చంద్రమోహన్, పన్నాల విష్ణువర్ధన్, జెల్లి సిద్ధయ్య, తోట రఘునాథ్‌రావు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్లు అనురాధ, శ్రీనివాస్‌రావు, మల్లికార్జున్, హనుమంత్, రాంచందర్, మేనేజర్ ప్రశాంత్,కొత్తపల్లి శ్రీకాంత్, ప్యాటా రవీందర్, రాధకృష్ణ, సూర్యప్రకాశ్, చంద్రశేఖర్, సంజీవరావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.