శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5: బైక్ అదుపు తప్పడంతో రాయదుర్గం ఫ్లై ఓవర్ నుంచి పడిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు ఆదిత్యనగర్‌కు చెందిన బొందులపాటి ప్రీతమ్ భరద్వాజ్(25) సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో నివసిస్తూ.. ఐటీ కారిడార్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై మెహదీపట్నం వైపు వెళ్తూ..రాయదుర్గం ఫ్లై ఓవర్‌పై అదుపుతప్పి రేలింగ్‌కు ఢీకొని..కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 వాహనంలో దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో భరద్వాజ్ తలకు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ.. బెల్టు లాక్ చేసుకోలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.