అబిడ్స్, ఫిబ్రవరి 5: పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమిరెడ్డి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రాంకీ గ్రూపు, రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ, డిశ్ యెబ్లేడ్ ఫౌండేషన్, ఎస్ఎన్ ట్రస్ట్, రవి హేలియోస్ ఆసుపత్రి సౌజన్యంతో పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటో, ట్రాన్స్ఫర్ స్టేషన్‌లోని సిబ్బందికి సికింద్రాబాద్ జోన్ రాంకీ ఉద్యోగులు అందరికీ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య శిబిరంలో కొవిడ్ పరీక్ష, అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు నిర్వహించి ఈసీజీ తదితర పరీక్షలు చేసి అవసరమైన వారందరికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదే విధంగా ఛర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు సాధారణ పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఉచితంగా మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ భాస్కర్, డాక్టర్ శృతి, డాక్టర్ శ్రీదేవి, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు రియాజుద్దీన్, ప్రతినిధులు మధుబాబు చికిలే, డాక్టర్ సీసా, ఐఎంఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ తోట కృష్ణారావు పాల్గొన్నారు.