గౌతంనగర్, ఫిబ్రవరి 5 : మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం బాక్స్ డ్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ ఈఈ లక్ష్మణ్ అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్, మల్లికార్జుననగర్‌లో కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను ఈఈ లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఈ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇందిరానెహ్రూనగర్, బీహరీ బస్తీ, రామాంజనేయనగర్ నుంచి వచ్చే వరద నీరు ముంపు ప్రాంతాలు మునగకుండా జ్యోతినగర్, మిర్జాల్‌గూడలో బాక్స్ డ్రైన్ నిర్మించామని, త్వరలోనే మల్లికార్జుననగర్‌లో బాక్స్ డ్రైన్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గౌతంనగర్ డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించి, వరద ముంపు లేకుండా డ్రైన్ పనులు చేపడుతున్నామని టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివ్య జ్యోతి, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు, మల్లికార్జుననగర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.