బేగంపేట్ జనవరి 27: రాంగోపాల్‌పేట్ డివిజన్ మహాత్మాగాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. గురువారం గాంధీ విగ్రహం పరిసరాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న గాంధీ విగ్రహం పక్కనే నూతనంగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అదే విధంగా అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మరో చోటుకు తరలించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బేగంపేట్ సర్కిల్ ఉప కమిషనర్ ముకుందరెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్ జలమండలి జీఎం రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, కిరణ్మయికిశోర్ తదితరులు పాల్గొన్నారు.