మేడ్చల్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు నడుం బిగించారు. ఫిబ్రవరి 5లోపు దళితబంధు అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజవర్గాలకు నియమించిన ప్రత్యేక అధికారుల బృందం స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశమై లబ్ధిదారుల ఎంపికపై చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొదటి దశలో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దళిత బంధు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసింది.
పథకాల జాబితా..
ట్రాన్స్పోర్ట్..
ఉత్పత్తి పథకాలు..
రిటైల్ దుకాణాలు..
సేవలు..
సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి మల్లారెడ్డి
దళిత బంధు అమలులో భాగంగా మేడ్చల్ జిల్లాలో గురువారం కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. దళిత కుటుంబాలను కలిశారు. దళిత బంధు పథకం అమలును వారికి వివరించారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.