
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24: తార్నాక డివిజన్లో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మో తె శ్రీలతాశోభన్‌రెడ్డితో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలాలతో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నా రు. గతంలో చిన్నపాటి వర్షాలకు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నుంచి ప్రజలను కాపాడుతున్నామన్నారు. తార్నాక డివిజన్లోని శాంతినగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో రూ.2.39 కోట్ల ఖర్చుతో నాలాల అభివృద్ధి, శాంతినగర్‌లో స్మార్ట్ వాటర్ బాక్స్ డ్రెయిన్ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా శాంతినగర్, ఆదర్శకాలనీ, లక్ష్మీనగర్, సిరిపురి కాలనీ, వినోభానగర్, లాలాపేట ప్రాంతాల్లో పాదయాత్ర చేసి, స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సునీల్ముదిరాజ్, శివశంకర్, కుమార్, నాగరాజు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.