తిరుమల : ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామికి ( Venkateshwar Swamy) భక్తులు ఆస్తుల సమర్పణను కొనసాగిస్తున్నారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కర్రావు మరణానంతరం వీలునామా ద్వారా రూ.3 కోట్ల విలువ గల ఇంటిని, రూ.66 లక్షల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను స్వామివారికి సమర్పించారు.
ఆయనను ఆదర్శంగా తీసుకున్న హైదరాబాద్ ( Hyderabad ) మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన టి.సునీత దేవి, టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు రూ.18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల గల ఇంటిని( House) మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో ఆస్తిని శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. ఆస్తికి సంబంధించిన పత్రాలను మంగళవారం తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ..
తిరుమల : తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష పర్వదినాల (Special festivals ) వివరాలను టీటీడీ(TTD) ప్రకటించింది. ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి, ఆగస్టు 4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు.
7న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ముగింపు, 8న ఆళ్వందార్ల వర్ష తిరు నక్షత్రం, 9న శ్రావణ పౌర్ణమి గరుడసేవను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 10న తిరుమల శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు, ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం, 17న తిరుమల శ్రీవారి సన్నిధిన శిక్యోత్సవం, ఆగస్టు 25న బలరామ జయింతి, వరాహ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.