కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌పై 24,068 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీలో మంగళవారం ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. 22 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 1,06,780 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 82,712 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3,012 ఓట్లు మాత్రమే వచ్చాయి.