కాసిపేట : భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురై మల్లెపల్లి శోభన్(42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కాసిపేట ఏఎస్సై బూర రవీందర్ ( ASI Ravinder ) తెలిపారు. తాండూర్‌కు చెందిన రేచిన్, అన్నారానికి చెందిన మల్లెపల్లి శోభన్ అనే ఇద్దరు దంపతులు సోమగూడెంలో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
భార్యభర్తల గొడవ విషయంలో భార్య పుట్టింటికి వెళ్లినందుకు మనస్థాపం చెంది ఆదివారం పురుగుల మందు సేవించాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని, ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెల్లడించారు .