Shaadi Mubarak | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో ఒకటి షాదీ ముబారక్. పేదింటి ఆడపిల్లల కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చే ఈ పథకం కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతుందో తాజాగా బయటపడ్డ స్కాం ఉదాహరణ.
అత్తాపూర్‌లో షాదీ ముబారక్ భారీ స్కాం వెలుగుచూసింది. ఓ ముఠా షాదీ ముబారక్ పేరుతో లక్షల రూపాయలు కొట్టేసింది. దొంగ పత్రాలు సృష్టించి 28 లక్షల కాజేసిన బండ్లగూడ ఆర్ఐతోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
28 లక్షల స్కామ్‌లో ఆర్ఐ వివాహం కాకముందే వివాహమైనట్టు దొంగ పత్రాలు సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు. 29 అప్లికేషన్స్ ను దరఖాస్తు చేయగా.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ 21 అప్లికేషషన్స్ను ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా అప్రూవ్ చేసినట్టు అధికారులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అత్తాపూర్ టాక్స్ ఫోర్స్ బృందం బడంగ్పేట్లో తలదాచుకున్న ఆరుగురితో కూడిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేసింది. నిందితులను అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.